తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న 32 వార్డులను 40 వార్డులుగా పునర్విభజన చేసి అభ్యంతరాలను తెలపాలని కందుకూరు మున్సిపల్ కమిషనర్ కె.అనూష ప్రకటించిన సందర్భంలో సిపిఐ బృందం మంగళవారం తమ అభ్యంతరాలను తెలియపరుస్తూ మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ప్రకటించిన 40 వార్డులు సామాన్య ప్రజలకు అర్థం కాని విధంగా ఉన్నాయని, ఎవరు ఏ వార్డులోకి వెళ్లారు అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారని అన్నారు. పరిపాలనా సౌలభ్యంగా వార్డుల విభజనలు ఉండాలని అయితే మున్సిపల్ అధికారులు ప్రకటించిన 40 వార్డుల విభజనలో అవకతవకులు ఉన్నాయని, వాటిని సరి చేస్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా సరిహద్దులను చూపాలని ఆయన కోరారు. గతంలో 13వ వార్డును సరిహద్దును పెంచుతూ చుట్టుగుంట, ముక్కోటి పాలెం, కండ్రా వారి పాలెం వరకు పొడిగించడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయ ని 13వ వార్డును యధావిధిగా ఉంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై ఆనందమోహన్, యు.మాధవరావు, సిహెచ్ దుర్గాప్రసాద్, బొల్లోజుల బాల బ్రహ్మచారి తదితరులు ఉన్నారు