తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ:-
గంగపట్నంలో రూ.3.10 కోట్లతో ఆలయాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రూ.2 కోట్లతో మండప నిర్మాణానికి, నుడా నిధులు రూ.10 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి, రూ.1 కోటితో శ్రీ భవానీ సమేత గంగా తారకేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాను.కూటమి ప్రభుత్వ సహకారంతో కోవూరు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో రూ.50 లక్షలతో నాలుగు వసతి గదులు, రూ.40 లక్షలతో డార్మిటరీ హాల్, జెడ్పీ నిధులు రూ.85 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి.దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, ఇతర అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించాను. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఆలయాల అభివృద్ధికి మరింత కృషి చేస్తాను.