ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలు, కాలనీల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహించారు.ఈ క్రమంలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో, ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో, కొరిశపాడు మండలం తమ్మవరం ఎస్సీ కాలనీలో, అలాగే నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.పోలీసు అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లో ఇళ్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు మరియు నేరాలకు ఆస్కారం ఉన్న అంశాలపై తనిఖీలు నిర్వహించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం, నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.అదేవిధంగా, కొరిశపాడు మండలం తమ్మవరం ఎస్సీ కాలనీలో గ్రామ పెద్దలతో పోలీసులు సమావేశమై, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని అవగాహన కల్పించారు. ఎన్నికల నియమ నిబంధనలను పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని సూచించారు.ప్రజలు తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం – నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల నిరంతర చర్యలు!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *