కనిగిరి పురపాలక సంఘం కార్యాలయంలో మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కనిగిరి ఆర్డీవో టి. అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *