ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన పి. అఖిల్ జాతీయ స్థాయి 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGFI) తైక్వాండో పోటీలకు రెఫరీగా ఎంపికయ్యారు. అండర్-17 బాలబాలికల జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రెఫరీగా అఖిల్ ఎంపిక కావడం విశేషం. ఈ పోటీలు అక్టోబర్ 22 నుంచి 26వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్నారు.ఈ ఎంపికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పి. అఖిల్ ఒక్కరే రెఫరీగా ఎంపిక కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. జాతీయ స్థాయి పోటీల్లో రెఫరీగా వ్యవహరించే అవకాశం లభించడం ప్రకాశం జిల్లా కందుకూరుకు గర్వకారణంగా నిలిచింది.ఈ సందర్భంగా జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, జిల్లా తైక్వాండో కార్యదర్శి మాస్టర్ ఎస్.కె. అబ్దుల్ సలాం, తైక్వాండో చైర్మన్ గోనుగుంట వెంకటేశ్వరులు, ఇతర కోచ్‌లు, జిల్లా తైక్వాండో అసోసియేషన్ సభ్యులు పి. అఖిల్‌ను అభినందించారు.అఖిల్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయిలకు చేరుకుని, క్రీడారంగంలో కందుకూరు, ప్రకాశం జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *