నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
రాష్ట్ర ఎన్నికల అధికారి విడుదల చేసిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన తో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం లో స్థానిక ఎన్నికల అధికారి సి హెచ్ సువార్త, సహాయ ఎన్నికల అధికారి దారా వెంకటరావు లు సోమవారం మండల పరిషత్ కార్యాలయం లో ఎన్నికల ప్రకటన చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు కార్యాలయం నోటీస్ బోర్డు లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అంటించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ లో శాంతి భద్రతలు, ఎన్నికల ప్రకటన ప్రకారం తొలుత నామినేషన్ ఏర్పాట్లు గురించి ఆర్వో సమీక్షించారు. నామినేషన్ ల దగ్గరనుండి ఎన్నికల ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల విధులలో ఉండే సిబ్బంది బాధ్యతగా నిబంధనలకు లోబడి ప్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు నిర్వహించాలని ఆర్వో సువార్త సూచించారు. సహాయ ఎన్నికల అధికారి దారా వెంకటరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు అందజేయాల్సిన ఎన్నికల సమాచారం, మార్కెడ్ ఓటర్ల జాబితా, ఇతర సామగ్రి సిద్ధం చేశారు. పోలింగ్ కి అవసరం అయిన పోలింగ్ బాక్స్ లను సిద్దం చేశామన్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఎన్నికలు సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు శాంతి భద్రతల పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి సింగరాయకొండ సిఐ వై శ్రీహరి, ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్ మండల పరిషత్ కార్యాలయం ప్రాంతంలో చేపట్టాల్సిన బందోబస్తు స్కీమ్ గురించి ఎన్నికల అధికారులతో చర్చించారు. మండల పరిషత్ కార్యాలయం ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, బందోబస్తు కి అవసరమైన చర్యలు గురించి ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ,రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బంది, శాంతి భద్రతలు పర్యవేక్షించే పోలీస్ సిబ్బందికి సహకరించాలని ఎన్నికల అధికారులు కోరారు.
