విజయదశమి పండుగను పురస్కరించుకొని ఘనంగా ఆయుధాలు మరియు వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ
ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అహర్నిశలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు ఆయుధాలు, వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు గారు సతీసమేతంగా పాల్గొన్నారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా భావించే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిత్యం ఉపయోగించే ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలని, దుర్గామాత ఆశీస్సులు అందరికీ కలగాలని పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, విజయదశమి పోలీసు శాఖకు ప్రత్యేకమైన పండుగ అని, ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులకు ఆయుధాలతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని, పోలీసు వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఆయుధాలను గౌరవిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ గారు గుర్తుచేశారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసే వాహనాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, జిల్లా పోలీసు శాఖ అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగాలన్నారు. ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలందరికీ జిల్లా ఎస్పీ గారు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతి కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్)వెంకటేశ్వర్లు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు వెంకటేశ్వరరావు, వీర నాయక్,విజయకృష్ణ, శేషగిరి రావు, ప్రసాద్, విజయచంద్ర, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామరెడ్డి, హాజరత్తయ్య, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
