తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తో కలిసి జడ్పిటిసి/ ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియను ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జె . పంగులూరు, లింగసముద్రం రిటర్నింగ్ అధికారులతో ఇతరులతో మాట్లాడి నామినేషన్ల ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియకు అభ్యర్థులను అనుమతించాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలన్నారు. నామినేషన్ కేంద్రం నుండి వంద మీటర్ల పరిధిలో నిబంధనను తూచా తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలు అలసత్వం వహించవద్దని ఆయన సూచించారు….