తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, గ్రామాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుగుండ్లపాడు గ్రామంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, గారి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.ఈ ఆపరేషన్లో భాగంగా గ్రామంలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు మరియు వస్తువులపై పరిశీలన చేపట్టారు. అదేవిధంగా గ్రామంలో వాహనాలను తనిఖీ చేసి, వాహనదారుల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర సంబంధిత పత్రాలను పరిశీలించారు.చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగిస్తూ, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.