తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి కార్యాలయంలో ఎన్డీయే (టీడీపీ-బీజేపీ-జనసేన) కూటమి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు పాల్గొన్నారు.గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి జేవీ.నారాయణతో పాటు బరిలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు వ్యూహాలపై నేతలు చర్చించారు..ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి పాలుగుళ్ల శివ సాయి ప్రతాప్ రెడ్డి కూటమికి పూర్తి మద్దతు ప్రకటించారు.. అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఎన్డీయే బలపరిచిన అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మూడు పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.