తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
రామాయణ మహా గ్రంధాన్ని రచించిన ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు సందర్భంగా సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీయస్.,గారు మరియు పోలీస్ అధికారులు జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రామాయణ స్ఫూర్తితో కుటుంబ, మానవతా విలువలను పెంపొందించుకొని ధర్మబద్ధంగా జీవించాలన్నారు. ఉన్నతమైన ఆదర్శాలను బోధించే రామాయణాన్ని రచించి, యుగాలు మారినా సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. ఆయన ఆశయాలను ఆచరిస్తూ, స్వార్థచింతనను వీడి సన్మార్గంలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. నేటి యువత వాల్మీకి మహర్షి జీవితం నుంచి స్ఫూర్తి పొంది, సత్యనిష్ఠ, క్రమశిక్షణ, కర్తవ్యబద్ధతతో జీవించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు,ఎఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.