ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల అధిపతులతో జిల్లా కలెక్టర్లతో అమరావతి నుంచి వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తుఫాను ను ఎదుర్కొనే విధంగా అన్ని శాఖలు సమాయత్తమే ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. రాజబాబు క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వీక్షణ కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో తుఫాను తాకిడి ఎక్కువగా ఉండే మండలాలలో ముందస్తు తగు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కరెంటు స్తంభాలు ఎక్కడైనా డ్యామేజ్ అయితే వెంటనే మరమ్మతులు చేసేలా ఉండాలన్నారు. నీటి సంఘాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా చూడాలని అదేవిధంగా పడవలు లంగర్ వేసుకుని రక్షణ స్థితిలో ఉండే విధంగా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ, హౌసింగ్ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లలో ఉండే విధంగా సరైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రక్షిత మంచినీరు మరియు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. జిల్లాస్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా అందుబాటులో ఉంచాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ అధికారి వరలక్ష్మి, కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారి మాధురి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *