ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ,ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలోని ఈశ్వరరావు నగర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.31,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *