రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఫ్లాగ్ మార్చ్‌లు, రూట్ మార్చ్‌లు, ఫుట్ మార్చ్‌లు నిర్వహించారు.చీమకుర్తి మండలంలోని చంద్రపాడు, పాటిమీదపాలెం గ్రామాల్లో సీఐ చీమకుర్తి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో రూట్ మార్చ్ నిర్వహించారు. టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ ఆధ్వర్యంలో, సింగరాయకొండ పట్టణంలో, అద్దంకి పట్టణంలో, దర్శి, సంతమాగులూరు, అద్దంకి రూరల్ సర్కిల్ పరిధుల్లో పోలీసు అధికారులు తమ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్‌లు చేపట్టారు.అలాగే జరుగుమల్లి గ్రామంలో, అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో, అమ్మనబ్రోలు, మాచవరం, ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించి ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏల్చూరు గ్రామంలో దర్శి ఎస్‌డీపీఓ గారి పర్యవేక్షణలో అద్దంకి టౌన్, అద్దంకి రూరల్, దర్శి సీఐలు, సంతమాగులూరు, మేదరమెట్ల, జె.పంగులూరు, కొరిశపాడు, దర్శి ఎస్‌ఐలు మరియు సిబ్బంది పాల్గొని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద కొత్తపల్లి, అంజయ్యనగర్ గ్రామాలు అత్యంత సున్నితమైన ప్రాంతాలు కావడంతో అక్కడ ప్రత్యేకంగా పోలీసు కవాతు నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.ఎన్నికల సమయంలో ప్రజలకు పోలీసుల సూచనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదు.ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు, అక్రమ కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
ప్రజల భద్రతకు, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడానికి ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని పోలీసు శాఖ స్పష్టం చేసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *