తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, ఒంగోలు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ సీఐ కమలాకర్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ చెంచయ్య మరియు సిబ్బంది ఈరోజు ఒంగోలు టౌన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టవిరుద్ధంగా సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి మొత్తం రూ.4,800 నగదును స్వాధీనం చేసుకున్నారు.అనంతరం, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇద్దరు వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదుతో సహా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.