తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
ముండ్లమూరు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ దేవినేని రమా–కోటేశ్వరరావు మరియు ఎంపీటీసీలకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీపీ అభ్యర్థి దేవినేని రమా–కోటేశ్వరరావు, 15 మంది టీడీపీ ఎంపీటీసీలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ ఎంపీటీసీలు:
పసుపుల – బిజ్జం సుబ్బారెడ్డి, ఉల్లగల్లు – కామణి కమలమ్మ, పోలవరం – మేదరమెట్ల గౌరీ, సింగన్నపాలెం – అచ్చుకట్ల నరేష్, ముండ్లమూరు – మేదరమెట్ల పిచ్చారావు, వేముల–2 – పిడతల ఆరోగ్యం, భీమవరం – కొండెద్దు నాగమ్మ, మారెళ్ల – ఎనిక బోయిన శ్రీను, కెల్లంపల్లి – మేరా జ్యోతి అంజిబాయ్, పూరిమెట్ల – ఓరూరి నాగేశ్వరరావు, ఉమామహేశ్వరపురం – దేవినేని రమాదేవి, నూజిలపల్లి – చాగంటి హనుమంతరావు, నాయుడుపాలెం – వేమవరపు నెహెమ్యా, పులిపాడు – దాసరి శ్రావణి, వేముల–1 – పంది వెంకాయమ్మ.
జనసేన ఎంపీటీసీ:
ఈదర – అడపాల వెంకాయమ్మ.
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సహాయ సహకారాలతో ముండ్లమూరు మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ, జనసేన ఎంపీటీసీలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, మండల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.