తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల గణిత ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వర రావు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జయంతిని గణిత శాస్త్రం పై ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం మ్యాథమెటిక్స్ డే గా ప్రకటించింది అని తెలియజేశారు. స్కూల్ హెడ్మాస్టర్ సైకం శ్రీవిద్య గణిత ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయులు,విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.