తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ లోని స్మార్ట్ జిన్ గ్లోబల్ స్కూల్లో డిసెంబర్ 22 న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల గణిత ప్రాజెక్టులను తయారుచేసి ప్రదర్శించారు.ఈ సందర్భంగా వేదికను అలంకరించిన పాఠశాల కరస్పాండెంట్. గీతా రాణి మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ జయంతిని, గణిత శాస్త్రం పై ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వము మ్యాథమెటిక్స్ డేగ ప్రకటించింది. అలాగే గణితం కేవలం ఒక సబ్జెక్ట్ కాదు. మన రోజువారి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, నిర్వహించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన సాధనం. అదేవిధంగా విద్యార్థులకు సమయపాలనకు, భవిష్యత్తుకు పునాది మరియు తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతుంది, క్రమబద్ధమైన జీవితానికి మార్గదర్శకంగా ఉంటుంది. అని ప్రసంగించారు.గణిత ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *