తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణ భద్రతను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు కొండపి సీఐ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రమాద సమయంలో తలకు తీవ్రమైన గాయాలు కలిగే అవకాశాల గురించి వాహనదారులకు వివరించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో స్పష్టంగా అవగాహన కల్పించారు.ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనం నడపాలని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రత కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.