తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ లోని స్మార్ట్ గ్లోబల్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి . విద్యార్థులు క్రీస్తు పుట్టుక నాటకాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా వేదికను అలంకరించిన పాఠశాల కరస్పాండెంట్ డా.N. గీతా రాణి క్రిస్మస్ గురించి మాట్లాడుతూ, క్రిస్మస్ పండగ ప్రేమ, శాంతి, సంతోషాలకు చిహ్నంగా నిలుస్తుంది. క్రీస్తు పుట్టినరోజున క్రిస్మస్ పండుగను జరుపుకోవడంలో ఆంతర్యం ఏమనగా ప్రతి వారితోను ప్రేమ, దయ, సహాయం వంటి గుణాలను అల వరుచుకుని మంచి వ్యక్తులుగా ఎదగాలి అని అర్థం. అంటూ తమ సందేశాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *