తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు త్రిపురాంతకం మండలం యల్లంపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌ను పోలీస్ సిబ్బందితో కలిసి త్రిపురాంతకం సీఐ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలు, అతి వేగం వల్ల కలిగే ప్రమాదాలు, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *