తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ చైర్మన్ గా 25 వా వార్డ్ టిడిపి నాయకులు ఉన్నం కొండలరావును నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నం కొండలరావు, గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు చైర్మన్ పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ లో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలని కొండలరావుకు ఎమ్మెల్యే సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *