తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన బాధ్యతతో పాటు ప్రాణ రక్షణకు అత్యంత కీలకమని వివరించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ISI ప్రమాణాలున్న హెల్మెట్ ధరించాలని, అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వాహనం నడిపి తనతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కాపాడాలని ప్రకాశం జిల్లా పోలీసులు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *