తొలి శుభోదయం కందుకూరు:-

తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈరోజు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా విద్యార్థుల కేరింతల మధ్య జరిగినవి. ఈ కార్యక్రమము ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి గారి ఆధ్వర్యంలో ,పౌరశాస్త్ర అధ్యాపకులు ఓరుగంటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగినవి.ఈ సంబరాల నందు విద్యార్థులకి సంక్రాంతి పర్వదినం యొక్క విశిష్టతను, కోడిపందాలు, గంగిరెద్దు ఆటలు,భోగిమంటలు, గాలిపటాలు పండగ విశిష్టతల గురించి రైతులకు సంక్రాంతి పండగకి కొత్త పంటలు వచ్చి వారు ఆనందముతో పండగను జరుపుకునే విధానాలను విద్యార్థులకి అధ్యాపక బృందం వివరించారు. గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు, భోగిమంటల విద్యార్థులను ఆనంద ఉత్సాహాలతో జరిగినది. కార్యక్రమమును అధ్యాపకులు దాసరి శిరీష, మాధవి లక్ష్మి, సీతారావమ్మ, చుండూరు బాబురావు, కట్టా సుబ్బారావు, దగ్గర ఉండి మరి చక్కగా నిర్వర్తించారు. సంబరాల నందు అధ్యాపకులు , రాజశేఖర్ మాధవరావు శివకుమారి విద్యార్థినీ విద్యార్థులు కార్యక్రమంలో విజయవంతం చేయడంలో భూమిక వహించారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *