తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజా భద్రత, సామాజిక అవగాహనలో భాగంగా మర్రిపూడి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt. Jr. College, Marripudi) ను సందర్శించి విద్యార్థులకు విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని మర్రిపూడి పోలీస్ స్టేషన్ ఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు రోడ్డు భద్రత, ముఖ్యంగా హెల్మెట్ ధారణ ప్రాముఖ్యత, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విద్యార్థులకు వివరించారు. అలాగే సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, అపరిచిత లింకులు, ఫేక్ అకౌంట్ల ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.అదేవిధంగా మహిళా సాధికారత, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, షక్తి యాప్ ఉపయోగం, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాల్సిన అవసరం గురించి వివరించారు. విద్యార్థులు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మారాలని, చట్టాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో జీవించాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థుల్లో మంచి స్పందనను పొందిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *