తొలి శుభోదయం కందుకూరు:-

37 వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు శుక్రవారం రవాణా శాఖ అధికారి వారి కార్యాలయము నందు స్కూల్ మరియు కాలేజీ బస్సు డ్రైవర్లకు మరియు ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి టీవీ నాగలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె,మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి వినూత్నంగా కథ రూపంలో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి అర్థమయ్యేలా వివరిస్తూ రహదారి భద్రత పై అవగాహన కలిగేలా వివరించడం జరిగినది. స్కూల్ మరియు కాలేజి డ్రైవర్ సోదరులందరూ కూడా పిల్లలు బస్సు దిగిన తర్వాత సురక్షితంగా రోడ్డు దాటారా లేదో చూసుకున్న తర్వాత మాత్రమే బస్సులు డ్రైవ్ చేయాలని తెలియజేశారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులనుదేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మీయొక్క వాహనమునకు సంబంధించిన ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అదేవిధంగా మితిమీరిన వేగంతో వాహనం నడపరాదని, డ్రైవర్ పక్కన ఎక్స్ట్రా సీటింగ్ ని తొలగిస్తామని, మద్యం సేవించకుండా వాహనం నడుపుతామని, ఎక్కువమంది ప్రయాణికులు ఎక్కించమని బస్ మరియు ఆటో డ్రైవర్ సోదరులందరి చే ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎంవీఐ జె అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క స్కూల్ బస్సు మరియు ఆటో డ్రైవర్ల వయస్సు రీత్యా అందరూ కూడా ప్రతినెల మీయొక్క కంటి పరీక్షలు మరియు బిపి,షుగర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, ప్రతి ఒక్క డ్రైవర్ మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ప్రతిరోజు 8 గంటలసేపు నిద్ర పోవాలని తెలియచేశారు. అలాగే ఎక్కువమంది ఆటో డ్రైవర్లు మరియు బస్ డ్రైవర్లు వాహనం నడుపు సమయంలో ఒక్క చేత్తో స్టీరింగ్ ను వాడటం గమనించడం జరిగింది అలా వాహనం నడుపుట వల్ల వాహనం అదుపు తప్పి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *