తొలి శుభోదయం ప్రకాశం:-
శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా మార్కాపురం పట్టణంలో విస్తృత స్థాయి వాహన తనిఖీలు మరియు ఫుట్ పట్రోలింగ్ నిర్వహించింది.మార్కాపురం సీఐ ఆధ్వర్యంలో, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, వాణిజ్య ప్రాంతాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అలాగే ఫుట్ పట్రోలింగ్ ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకొని భద్రతపై భరోసా కల్పించారు.పట్టణంలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్ 112 / 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు ఇలాంటి వాహన తనిఖీలు, ఫుట్ పట్రోలింగ్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.