తొలి శుభోదయం ప్రకాశం:-
స్వాతంత్ర్య సమరయోధుడు, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ ఆఫీస్ ప్రాంగణంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వడ్డే ఓబన్న గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వడ్డే ఓబన్న సామాజిక న్యాయం, స్వాతంత్ర్య స్పూర్తితో ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని పోలీసులు పేర్కొన్నారు. వారి ధైర్యం, త్యాగం నేటి తరాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం వారు చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ ప్రేరేపించేదిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని వడ్డే ఓబన్న గారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామరెడ్డి, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.