తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
ముండ్లమూరు మండలం పులిపాడు గ్రామానికి చెందిన దాసరి జరీష అనారోగ్యంతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ₹1,53,670 రూపాయల LOCను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, గ్రామ నాయకులు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.