తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ శాఖ అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి ప్రత్యేక దాడులు నిర్వహించింది. చిమకుర్తి పట్టణం, గరికమిట్ట అవుట్‌స్కర్ట్స్‌లో జూదం ఆడుతున్న ఐదు (05) మందిని పట్టుకొని వారి వద్ద నుండి ₹12,450/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ, చిమకుర్తి తెలిపారు. పి.చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీ వరం గ్రామం – కొత్తముక్క అవుట్ఫీల్డ్స్లో అక్రమ జూదం ఆడుతున్న ముగ్గురు (03) వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ₹50,200/- నగదు స్వాధీనం చేసుకున్నారు. హెచ్.ఎం.పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండారెడ్డి గ్రామ పొలాల వద్ద జూదం ఆడుతున్న ఆరుగురు (06) వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి ₹20,400/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పొన్నలూరు మండలం అగ్రహారం గ్రామం చివర పొలాల మధ్యలో పేకాట ఆడుతున్న ఐదు (05) మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ₹3,400/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ, పొన్నలూరు వెల్లడించారు.ఈ దాడులలో మొత్తం 19 మంది నిందితులను అరెస్ట్ చేసి, ₹86,450/- నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ అధికారులు హెచ్చరించారు.