ఈ సంక్రాంతికి ప్రతి ఇంట ఈ భోగి మీకు భోగభాగ్యలను , సంక్రాంతి మీకు సుఖసంతోషాలను , కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి, సంక్రాంతికి ప్రతీ ఇల్లు ధాన్యపురాశులతో కళకళలాడుతాయి. ఉషోదయాన్నే హరిదాసుల కీర్తనలు భం భం జంగమదేవరలు హాస్యాన్ని పండించే వేషధారణతో పగటివేషగాళ్ళు డూ డూ బసవన్న అంటు గంగిరెద్దులవాళ్ళు, మా ఇంటికి రండి అని ఆహ్వానించే గొబ్బెమ్మలు,గాలి పటాల రెపరెపలతో పల్లెలన్నీ కళకళలాడుతాయి , నేటి సంక్రాంతి అందరి జీవితాలలో నూతనకాంతి నింపాలని ఆకాంక్షిస్తూ కందుకూరు నియోజకవర్గం ప్రజలకు, వైయస్సార్సీపి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు కందుకూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *