తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇళ్ల స్థలాల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియపై చర్చించాను.గతంలో జరిగిన లోపాలు, అవకతవకలను సరిదిద్దుతూ ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించాను. అర్హులైన ఒక్క కుటుంబం కూడా నష్టపోకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేస్తాం.పేదల సొంతింటి కల సాకారం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. త్వరలోనే అర్హులందరినీ గుర్తించి ఇళ్ల స్థలాల కేటాయింపును చేపడతాం.