ముప్పాళ్ళ గ్రామానికి చెందిన పత్తిపాటి యలమందయ్య గారి కుమారులు ద్విచక్ర వాహనదారులకు 50 హెల్మెంట్లు బహుకరణ
తొలి శుభోదయం కొండేపి:-
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముప్పాళ్ళ గ్రామానికి చెందిన పత్తిపాటి యలమందయ్య గారి కుమారులు పత్తిపాటి హరిబాబు మరియు పత్తిపాటి మాధవరావు లు ఇద్దరు కలిసి వారి తండ్రి జ్ఞాపకార్థం వారి తండ్రిని స్మరించుకుంటూ గుర్తుగా ద్విచక్ర వాహనదారులకు దాదాపు 50 హెల్మెంట్లు బహుకరణ చేశారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు, ముఖ్యంగా మైనర్లు ద్విచక్ర వాహనాన్ని నడపకూడదు, ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని మీ జీవితాన్ని మీరే కాపాడుకోండి, ముఖ్యంగా యువతలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చాలా అవసరం, హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి, ప్రస్తుత సమాజానికి మీరు ఆదర్శంగా నిలవండి, జరిమానా తప్పించుకోవడానికో లేక పోలీసుల కోసమో కాదు, మీకోసం మీ భద్రత కోసం హెల్మెట్ ధరించండి, అదేవిధంగా పోలీసు వారికి సహకరించండి, మద్యం సేవించి వాహనాలను నడపవద్దు, రాంగ్ రూట్లో ప్రయాణించవద్దు, అధిక స్పీడ్ తో వాహనాలను నడపవద్దు అని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వాహనదారులకు మరియు ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు, చెక్క వెంకట కేశవరావు, మిడసల అనిల్, పారాబత్తిన మధుబాబు, దానయ్య, నూకతోటి మాధవరావు, నల్లపు బ్రహ్మయ్య, నూకల లక్ష్మీనారాయణ, వీరనారాయణ, ప్రసాద్, బుచ్చయ్య గుప్తా జన సైనికులు పాల్గొన్నారు.
