తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారిపై ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన మరియు తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ పోలీసులు, స్పెషల్ పార్టీ, హైవే అధికారులు కలిసి వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం, తప్పు దారిలో వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై చట్ట ప్రకారం జరిమానాలు విధించి, భవిష్యత్తులో రోడ్డు నిబంధనలు పాటించాలని కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యం. హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడటం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి” అని సూచించారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.