తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని న్యూ ఎస్బిఐ ఎదురుగా కొత్తగా ఏర్పాటుచేసిన టీ పార్కును కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు పి. బ్రహ్మయ్యకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ…. వ్యాపారం బాగా జరగాలని, కస్టమర్లను ఆకట్టుకునేలా నాణ్యత పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల టిడిపి అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి గొట్టిపాటి హరికృష్ణ, మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసులు, గొంది నరసింగరావు పాల్గొన్నారు