తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు శ్రీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం మరియు పరువేట కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ గారు, ట్రాఫిక్ సీఐ మరియు పోలీస్ సిబ్బంది రంగారాయుడు చెరువుతో పాటు పరువేట కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పండుగల సమయంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.