తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం నియంత్రణకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వి.వి. పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోకూరు గ్రామ పొలాల్లో అక్రమంగా జూదం ఆడుతున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న 7 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.21,760/- నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.అక్రమ జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు కనిపిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *