తొలి శుభోదయం కనిగిరి:-
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కనిగిరి మున్సిపాలిటీ శివనగర్ కాలనీలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ కన్వీనర్ గుత్తి శ్రీధర్ ప్రారంభించారు. బాలికలు, యువతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలిక విద్యా ప్రాధాన్యత, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులు పై అవగాహన కల్పించేలా సందేశాత్మకంగా రంగవల్లులను యువతులు తీర్చిదిద్దారు. దీంతో ఆ రంగవల్లులు అందరిని ఆకట్టుకునేలా వారిచ్చిన సందేశాలను గురించి ఆలోచింపజేశాయి. ఐద్వా నాయకులు ముగ్గుల పోటీలలో ప్రతిభను చూపిన వారిని విజేతలుగా ఎంపిక చేశారు. విజేతలకు యుటిఎఫ్ మార్కాపురం జిల్లా అధ్యక్షులు షేక్ కాజా రహమతుల్లా బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ లు మహిళ, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతూ పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పండుగ వాతావరణం లో ఐక్యతను పెంపొందించేందుకు ఈ పోటీలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను, సౌకర్యాలను, పథకాలను సద్వినియోగం చేసుకొని అభ్యున్నతి సాధించాలని సూచించారు. ప్రధమ బహుమతిని గోపిశెట్టి పావని చందు, ద్వితీయ బహుమతిని డి రాజేశ్వరి, తృతీయ బహుమతిని జోష్ణ, చతుర్ద బహుమతిని సుశీల, ఐదవ బహుమతిని సుప్రజ అందుకోవటం జరిగింది. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతిని ముగ్గుల పోటీల నిర్వాహకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు నరేంద్ర, పాండు,అశోక్, టోపీవలి, ఎలీషా, కొండలరావు ఐద్వా నాయకులు శాంతకుమారి, ఎలీషమ్మ, వెంకటమ్మ, రత్తమ్మ,ప్రమీల, కె రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.