గ్రామీణ మహిళల కు భరోసా భద్రత కల్పించేందుకు అవగాహన కలిగి ఉండాలని సింగరాయకొండ ఎపిఎం భాగ్యలక్ష్మి పిలుపు ఇచ్చారు. శుక్రవారం పాత సింగరాయకొండ లక్ష్మీనరసింహ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మన డబ్బు మన లెక్కలు,సూపర్ నారి యాప్ పై నిర్వహించిన కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ మహిళల లో సాధికారిత సాధించేందుకు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు మహిళాభివృద్ధి భద్రత కోసం ప్రభుత్వం చేపట్టే ఇలాంటి యాప్ ల పై అవగాహన పెంచుకోవాలని ఆమె అవగాహన కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రతి పొదుపు మహిళా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎల్ సి మాధవరావు, సి సి సత్యవాణి,వి వో ఎ శ్రీదేవి తదితరులు అవగాహన కార్యక్రమం లో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *