తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ప్రతి ఓటు మన విజయానికి పునాది. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు), SIR బృందాలు, యూనిట్ ఇన్‌చార్జులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఓటర్ మ్యాపింగ్, సంస్థాగత బలోపేతంపై సమీక్ష నిర్వహించాను.ప్రజల వద్దకు వెళ్లే ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించాను. అలాగే I-TDP సభ్యులు సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉంటూ, ప్రతి ఒక్కరూ My TDP యాప్‌ను వినియోగించుకోవాలని తెలియజేశాను.బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల ఆశీర్వాదాలతో రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దాం.