తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ యాత్రలో శుక్రవారం పాల్గొనడం జరిగింది. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారు, మున్సిపల్ కమిషనర్ అనూష గారు, ఇతర అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సైకిల్ తొక్కి, అనంతరం మొక్కలు నాటడం జరిగింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందడానికి, పచ్చదనాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలి. పర్యావరణానికి శాపంగా మారిన ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు నివారిద్దాం. రోజువారీ జీవితంలో వీలైనంత వరకు మోటారు వాహనాల వినియోగం తగ్గించి, నడక లేదా సైకిల్ వాడకాన్ని అలవాటు చేసుకుందాం. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒక్క రోజుతో ముగిసేది కాకూడదు, నిత్య జీవితంలో మనమంతా దీనిని ఒక బాధ్యతగా స్వీకరించాలి. భవిష్యత్ తరాలకు పచ్చని, స్వచ్ఛమైన కందుకూరును అందిద్దాం.