తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనమనమెళ్లూరు గ్రామంలో విస్తృత స్థాయి ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని SI, Maddipadu PS నేతృత్వంలో నిర్వహించి, గ్రామ ప్రజలకు నిత్యజీవితంలో అత్యంత అవసరమైన భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగాహెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం, రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ పాత్రOTP మోసాలు, సైబర్ ఫ్రాడ్స్ నుంచి ఎలా జాగ్రత్త పడాలి, అనుమానాస్పద కాల్స్/లింక్స్‌కు స్పందించకూడదనే సూచనలు
దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు
CAW (Crime Against Women) – మహిళల భద్రత, రక్షణ, చట్టపరమైన సహాయం, పోలీస్ సహకారంవంటి అంశాలపై ప్రజలకు సవివరంగా వివరించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి మోసాలు లేదా అక్రమ ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు–పోలీసుల సమన్వయం ఎంతో కీలకమని ఈ సందర్భంగా తెలియజేశారు. అక్రమాలు, నేరాల నివారణకు ప్రకాశం జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి పనిచేస్తారని భరోసా ఇచ్చారు.