తొలి శుభోదయం కందుకూరు:-

నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, దివి శివరాం గారు, పార్టీ నేతలు

వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు, అభిమానులు

300 మందికి పైగా రక్తదానం

స్వయంగా రక్తదానం చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెంగమాంబ కళ్యాణ మండపంలో భారీ అన్నదానం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వర్ధంతిని కందుకూరు పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెంగమాంబ కళ్యాణ మండపం చేరుకొని, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివరాం కలిసి ప్రారంభించారు. అనంతరం వర్ధంతి సభ జరిగింది. పట్టణంతోపాటు అన్ని మండలాల నుంచి వేల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చి అన్నగారిని స్మరించుకుంటూ జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి MLA ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సహా నేత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ఏడాదిలో మరణించిన పార్టీ నేతలు కార్యకర్తలకు సంతాపం తెలిపారు. తరువాత సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టి, వారి గుండెల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఒకే ఒక నాయకుడు నందమూరి తారక రామారావు అన్నారు. ఆయన అమలు చేసిన పథకాలన్నీ పేదలు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. మండల కార్యాలయాలు, బస్ స్టేషన్ల నిర్మాణం, మహిళలకు ఆస్తిలో వాటా, రెండు రూపాయలకు కిలో బియ్యం లాంటి కార్యక్రమాలకు బీజం వేసింది ఎన్టీఆర్ అన్నారు. వృద్ధుల కోసం 30 రూపాయలతో పెన్షన్ పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే, చంద్రబాబు నాయుడు గారు నేడు దాన్ని 4 వేలకు తీసుకువెళ్లారని ఎమ్మెల్యే చెప్పారు. ఎన్టీఆర్ ఆశలు, ఆశయాలను చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ బలంగా ఉండేలా కృషి చేస్తున్నానని, గత ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కళ్ళముందు కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం మాట్లాడుతూ ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి అని, తెలుగు ప్రజలు ఆయన ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పింఛన్లను తొలగించారని, వారందరికీ న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావును కోరారు. 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్లీ నాగేశ్వరరావు గెలవడం ఖాయమన్నారు.300 మందికి పైగా రక్తదానం
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వెంగమాంబ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, 300 మందికి పైగా రక్తదానం చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ప్రధానంగా యువత, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తం ఇచ్చారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారందరినీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు పలకరించి అభినందించారు. రక్త దాతలకు సర్టిఫికెట్లు అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ క్యాలెండర్, డైరీలను ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆవిష్కరించారు. శిబిరంలో సేవలందించిన తెలుగు నాడు పారామెడికల్ సిబ్బంది, తెలుగు యువతను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. భారీ అన్నదానం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని టిడిపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వేలాదిమందికి అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, రాచగర్ల సుబ్బారావు పూరిమెట్ల గురునాథం, జనిగర్ల నాగరాజు, మాదాల లక్ష్మీనరసింహం, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, ఎన్టీఆర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, కండ్రా మాల్యాద్రి, నార్నె రోశయ్య నెల్లూరు పార్లమెంటు పార్టీ ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, పార్లమెంట్ కమిటీ సభ్యులు చదలవాడ కొండయ్య, మద్దసాని మహేంద్ర షేక్ రూబీ, దార్ల యలమందమ్మ, రాష్ట్ర నాయకులు షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, గొట్టిపాటి హరికృష్ణ, కూనం నరేంద్ర నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, అల్లం వెంకటేశ్వర్లు, ముచ్చు శ్రీను, పొడపాటి మహేష్, మోదడుగు వెంకటేశ్వర్లు రెబ్బవరపు మాల్యాద్రి పూరిమెట్ల మాల్యాద్రి, షేక్ మున్నా, తెలుగు నాడు పారా మెడికల్ సిబ్బంది పొన్నగంటి వెంకటరావు లక్ష్మీ రాజ్యం, దూదిపల్లి అఖిల మరియు నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *