తొలి శుభోదయం కందుకూరు:-

ఇదిగో మా సమస్య, మా ఇబ్బందులు ఇవి…అని ఎవరైనా చెబితే చాలు. వెంటనే స్పందించే గుణం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిది. అధికారులకు పరిష్కార మార్గాన్ని చూపించి, పని పూర్తయ్యే వరకు మరిచిపోయే వ్యక్తి కాదు ఆయన. కందుకూరు పట్టణంలోని 6 వ వార్డులో ముస్లిం సోదరులు అంత్యక్రియలు నిర్వహించుకునే ఖబరస్థాన్ మొత్తం పిచ్చి చెట్లతో నిండిపోయి, చిట్టడివిలాగా ఉన్న కారణంగా… అంత్యక్రియలకు అనేక ఇబ్బందులు ఎదురవుతుండేవి. కనీసం లోపలికి నడిచి వెళ్లే దారి కూడా సక్రమంగా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారం క్రితం ఖబ్రస్తాన్ కమిటీ సభ్యులు 6వ వార్డు ముస్లిం నేతలు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ని కలిసి ఖబరస్థాన్ దుస్థితిని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. 20 సంవత్సరాల నుంచి తాము ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించారు. ముస్లిం సోదరుల వినతిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు , ఖబరస్తాన్ ను వెంటనే బాగు చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదే రోజు జేసీబీ పని మొదలుపెట్టింది. వారంలోపే ఆ ప్రదేశం అంతా పరిశుభ్రంగా మారింది. ఎమ్మెల్యే చొరవకు, ఆయన వేగంగా స్పందిస్తున్న తీరుకు ఖబరస్తాన్ పని ప్రత్యక్ష సాక్ష్యం. ఆ అల్లాహ్ ఎమ్మెల్యే నాగేశ్వరరావు చల్లగా చూడాలి… అని ముస్లిం కుటుంబాలు నిండు మనసుతో దీవిస్తున్నాయి.ఈ కార్యక్రమంలో ఖబ్రస్తాన్ కమిటీ మరియు MDO కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్ హమీద్, షేక్ ముస్తఫా,సయ్యద్ అహ్మద్
షేక్ సందాని, షేక్ సలీం, నసీర్ మౌలానా, సయ్యద్ ఆరిఫ్ ఉద్దీన్ మరియు టిడిపి ముస్లిం నాయకులు సయ్యద్ అష్మతుల్లా, షేక్ మున్న, షేక్ ఫిరోజ్, షేక్ ఖాదర్ సయ్యద్ అహ్మద్ బాషా, సయ్యద్ నసిర్, షేక్ బాషా, షేక్ గౌస్ బాషా, షేక్ ఫాజిల్, షేక్ నాయబ్ రసూల్, షేక్ రెహమాన్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *