తొలి శుభోదయం ప్రకాశం:-

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పిసిఆర్ మరియు డ్రోన్ కెమెరాల ఇంచార్జి ఇన్స్పెక్టర్ దుర్గప్రసాద్ ఆధ్వర్యంలో స్కూల్, కాలేజీ ప్రారంభం మరియు ముగింపు సమయాల్లో పోలీసు బీట్స్‌తో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయటం జరిగింది. విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు వెళ్లే సమయంలో మోటార్ సైకిళ్లు, ఆటోల్లో వేధింపులకు పాల్పడే అకతాయిలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరిగింది. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి అనుచిత చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్స్, కాలేజీల వద్ద దింపే సమయంలో పరిసర ప్రాంతాలపై కాస్త శ్రద్ధ చూపాలని, ఏవైనా అనుమానంగా అనిపిస్తే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ మరియు కాలేజీల వద్ద బయట రహదారి కనిపించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా పరిసరాల్లో జరుగుతున్న అంశాలను సులభంగా గమనించవచ్చని తెలిపారు. స్కూల్స్ లేదా కాలేజీల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.స్కూల్ ప్రారంభానికి ముందు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఉపాధ్యాయులు స్కూల్ పరిసరాలను కాస్త గమనిస్తే భద్రత మరింత మెరుగవుతుందని పోలీసులు తెలిపారు.అలాగే స్కూల్స్ లేదా కాలేజీల పరిసరాల్లో ఇబ్బందులు కలిగించే లేదా వేధింపులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *