తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :-
గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ రమణబాబు సిబ్బంది సహకారంతో తొలగింపజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు చెత్తాచెదారాన్ని కాలువల్లో వేయకుండా ఇంటింటికీ వచ్చే చెత్త రిక్షాల్లోనే వేయాలని సూచించారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. దీంతో వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల సమస్యలు తగ్గి ప్రజారోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు