తొలి శుభోదయం ప్రకాశం:-

మార్కాపురం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యం సేవన (Open Drinking / Open Boozing) ప్రాంతాల తొలగింపు మరియు శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మోటు బస్ స్టాండ్, పొదిలి, అర్ధవీడు, మార్కాపురం టౌన్, దారిమడుగు గ్రామం, BV పేట అవుట్‌స్కర్ట్స్, Y. పాలెం, పెద్ద చెర్లొపల్లి, కొత్తపల్లి (గిద్దలూరు), త్రిపురాంతకం, పెద్దారవీడు, H.M.పాడు తదితర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది స్థానిక ప్రజలు, మున్సిపల్/పంచాయతీ కార్మికుల సహకారంతో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి, మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తూ పరిసరాలను పూర్తిగా శుభ్రపరిచారు. అదే సమయంలో బహిరంగ మద్యం సేవన వల్ల కలిగే సామాజిక దుష్పరిణామాలు, నేరాలకు దారితీసే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని, ఇది ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు సామాజిక శాంతికి భంగం కలిగిస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజా ప్రదేశాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని, బహిరంగ మద్యం సేవనం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *