తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరు పట్టణం గుర్రం వారి పాలెం లోని శ్రీ సంస్కృతి స్కూల్ లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాఠశాల చైర్మెన్ మరియు ప్రిన్సిపాల్ అతిధులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం సోషల్ టీచర్ నరసింహారావు గారు భారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ సేవలను రాజ్యాంగ విలువలను విద్యార్థులకు వివరించారు. ఆ తరువాత విద్యార్థుల ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు మరియు భారత స్వాతంత్ర్య పోరాటం అనే నాటిక సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఆ తరువాత విద్యార్థులందరూ దేశ సమగ్రతను కాపాడతామని, బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్బంగా ఛైర్మెన్ కొంకా చంద్రశేఖర్ మట్లాడుతూ ఈ రోజు ఆకాశంలో రెపరెప లాడుతున్న మన త్రివర్ణ పతాకం కేవలం ఒక వస్త్రం కాదు, అది 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం. కాబట్టి మన రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ గారు చెప్పినట్లు చదవండి, సమీకరించుకోండి, పోరాడండి.చివరిగా ఒకమాట… స్వాతంత్ర్య అంటే స్వేచ్ఛ కాదు, ఆ స్వేచ్ఛ ను గౌరవించే సంస్కారం మీ ప్రవర్తనతో మన సంస్కృతి స్కూల్ కీర్తని, తద్వారా మనదేశ గౌరవాన్ని దశదిశలా చాటాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులకు తల్లిదండ్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరి, వైస్ ప్రిన్సిపాల్ శోభారాణి అకడమిక్ కో ఆర్ఢినేటర్ శకుంతల మరియు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు తల్లిదండ్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *