తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా MSCD (Mobile Surveillance & Criminal Detection) వ్యవస్థను వినియోగిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.ఈ తనిఖీల్లో భాగంగా ప్రజాసంచారం అధికంగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, లాడ్జీలు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, గ్రామాలు మరియు పట్టణ పరిధుల్లో సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తులు, పరాయి వ్యక్తుల వివరాలను MSCD సాంకేతిక వ్యవస్థ ద్వారా పరిశీలించారు.వారి గుర్తింపు వివరాలు, చిరునామా, గత నేర చరిత్ర ఉందా లేదా అనే అంశాలను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో తక్షణమే ధృవీకరించి, అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.నేరస్తుల కదలికలను ముందుగానే గుర్తించి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడం, ప్రజలకు భద్రతాభావాన్ని కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ విధమైన తనిఖీలు జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 / 100కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేర రహిత, సురక్షిత ప్రకాశం జిల్లాను సాధించవచ్చని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *