తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, మార్కాపురం జిల్లా పోలీసులు మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ (Shakthi App) డౌన్‌లోడ్ మరియు Shakthi SOS వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో, భద్రంగా జీవించేందుకు ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పోలీసులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తి SOS యాప్ ఇన్‌స్టాలేషన్ చేసి మహిళలు, బాలికలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో Shakthi SOS బటన్ నొక్కడం ద్వారా వెంటనే పోలీసుల సహాయం ఎలా అందుతుందో ప్రాక్టికల్‌గా వివరించారు.అలాగే ఒంగోలు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌లో జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ టీమ్–1 ఆధ్వర్యంలో శక్తి యాప్ డౌన్‌లోడ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, మహిళలు, యువత తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, దాని వినియోగంపై స్పష్టమైన అవగాహన పొందారు.ఇంకా OGL హెడ్‌క్వార్టర్స్ టీమ్–II ద్వారా కూడా శక్తి యాప్‌లు విస్తృతంగా డౌన్‌లోడ్ చేయించి, మహిళల భద్రతకు ఈ యాప్ ఎంత ఉపయోగకరమో ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, శక్తి యాప్ మహిళలకు ఒక రక్షణ కవచంలాంటిదని, లైవ్ లొకేషన్ షేరింగ్, ఎమర్జెన్సీ అలర్ట్స్, వేగవంతమైన పోలీస్ స్పందన వంటి ఫీచర్లు మహిళల భద్రతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, గృహ హింస, సైబర్ నేరాలు వంటి ఘటనలు ఎదురైతే వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీసులను సంప్రదించాలని సూచించారు.ప్రకాశం జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం భవిష్యత్తులో కూడా బస్ స్టాండ్లు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాలు వంటి ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలిపారు. మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమై శక్తి యాప్ డౌన్‌లోడ్ చేయించి అవగాహన కల్పించారు.